ఇండ్లలో పడుకోవద్దు, వీధుల్లోకి వచ్చి పోరాటం చేయండి!

క‌లం, మెద‌క్ బ్యూరో: దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ ఢిల్లీ రోడ్లపై వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుంటే, కాంగ్రెస్ కార్యకర్తలు ఇండ్లలో పడుకోవడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) అన్నారు. రాహుల్‌కు మద్దతుగా ప్రతిఒక్కరూ వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా సంగారెడ్డి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ… రాహుల్ గాంధీ చేపట్టిన ఈ పోరాటానికి కాంగ్రెస్ శ్రేణులతో పాటు దేశ ప్రజలందరూ పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.

దేశంలో ఓట్ చోరీ జరుగుతోందని, బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోందని, స‌ర్ ప్రక్రియ‌ అంశాలను ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మరో పది మందికి ప్రచారం చేయాలని కోరారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు రాహుల్ గాంధీ పోరాటం ఆపబోనని ప్రకటించారని, ఆయన డిమాండ్లు నెరవేరే వరకు సంగారెడ్డిలో తన పోరాటం కూడా నిరంతరం కొనసాగుతుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>