గద్వాల మున్సిపాలిటీలో అక్రమ వెంచర్లపై కొరడా

​కలం, జోగులాంబ గద్వాల: గద్వాల మున్సిపాలిటీ (Gadwal Municipality) పరిధిలో అక్రమంగా ఏర్పాటు చేస్తున్న వెంచర్లపై యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. గద్వాల–ఐజ రహదారిలోని సర్వే నెంబర్ 871లో మున్సిపల్ అనుమతులు లేకుండా కొందరు వెంచర్‌ ఏర్పాటు చేశారు. సమాచారం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ జానకీరాం సాగర్ వెంచర్‌ను పరిశీలించి.. హద్దు రాళ్లను తొలగించారు. ​ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, సంబంధిత అన్ని శాఖల అధికారిక అనుమతులతోనే వెంచర్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలతో పాటు అవసరమైతే వాటిని కూల్చివేస్తామని కమిషనర్ జానకీరాం సాగర్ హెచ్చరించారు. అలాగే అమాయక ప్రజలు ఎవరూ కూడా అనుమతులు లేని అనధికార వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయి, ఆర్థికంగా నష్టపోవద్దని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. పట్టణ శివారులో అక్రమ వెంచర్లపై మున్సిపల్ అధికారులు తీసుకున్న ఈ కఠిన చర్యల పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>