ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ

కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో ఇండియా కూటమి (INDIA Bloc) నేతలు కదం తొక్కారు. సుప్రీం కోర్టుకు వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నేతలు ర్యాలీగా బయల్దేరారు. కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. నడుచుకుంటూ సుప్రీం కోర్టుకు వెళ్తున్నారు. అంతకుముందు వారు కాన్‌స్టిట్యూషన్ క్లబ్ నుంచి బస్సులో వెళ్లగా.. మధ్యలోనే ఆగి కార్యకర్తలతో నడవడం ప్రారంభించారు. దీంతో సెక్యూరిటీ గార్డులు అప్రమత్తమయ్యారు.

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేడం, సర్ ప్రక్రియను రద్దు చేయాలనే డిమాండ్లతో సుప్రీం కోర్టుకు వెళ్లి మెమోరాండం సమర్పిస్తామని చెబుతున్నారు. ఇండియా కూటమి నిరసనలతో బారా కాంబా ప్రాంతం దద్దరిల్లిపోయింది. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల నుంచి వందల మంది నేతలు తరలివచ్చారు. దేశ రాజధానిలో చోటు చేసుకుంటున్న ఈ అనూహ్య నిరసనలతో ఢిల్లీ పోలీసులు సహా కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే రాజధానిలో సుమారు 25 వేల మంది భద్రతా బలగాలను మోహరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>