కలం, సినిమా: టాలీవుడ్‌లో వారసత్వాన్ని ఉనికి పుచ్చుకొని హీరో, హీరోయిన్స్ కిడ్స్ ఇంట్రీ ఇస్తూ, తమదైన ముద్ర వేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, రాజశేఖర్ లాంటి హీరోల కిడ్స్ ఇప్పటికే నటనలో రాణిస్తూ మెప్పిస్తున్నారు. తాజాగా హీరో శ్రీకాంత్ కుమార్తె మేధా మేక (Medha Meka) ఎంట్రీ ఇచ్చింది. మేధా హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది.
అయితే స్టాట్ డాటర్స్‌లా దక్షిణాదిలో శ్రుతి హాసన్, ఐశ్వర్య అర్జున్.. బాలీవుడ్‌లో ఆలియా భట్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్‌లా మేధా మేక కూడా హీరోయిన్‌గా మెప్పిస్తుందా? అని తెలుగు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. స్టార్ డాటర్‌గా ఎంట్రీ సులభమే అయినా.. ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడమే అసలైన సవాల్. మరి మేధా తన టాలెంట్‌తో ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

