సీఎం రేవంత్‌పై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో జరుగుతున్న అరాచకాలపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ సందర్భంగా రేడియల్ రోడ్ల కాంట్రాక్టుల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. సుశీ ఇన్‌ఫ్రా సంస్థ రూ.600 కోట్లు తక్కువకు బిడ్ వేసినప్పటికీ, ఆ సంస్థకు కాంట్రాక్టులు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంపెనీలకు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాగార్జున కన్‌స్ట్రక్షన్స్, బీవీఎస్ఆర్, జీకేసీ అనే మూడు ఆంధ్రా కంపెనీలకే టెండర్లు కేటాయించారని మండిపడ్డారు. తెలంగాణ సొమ్మును దోచుకోవడం, కమీషన్లు దండుకోవడం కోసమే తక్కువ బిడ్ వేసిన తమ సంస్థకు కాంట్రాక్టు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తాను కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. అలాగే సింగరేణి సంస్థలోనూ అవినీతి జరుగుతోందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. గత మూడేళ్లుగా సింగరేణిలో అవినీతి కొనసాగుతోందన్నారు. సీఎం రేవంత్ కారణంగా సింగరేణి మూతపడే పరిస్థితి నెలకొందన్నారు. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>