కలం, నిజామాబాద్ బ్యూరో: సర్ ప్రక్రియను రద్దు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం (POW) నిజామాబాద్ (Nizamabad) జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్నారు. SIR పేరుతో దేశవ్యాప్తంగా చాలా మంది ఇబ్బందులకు గురవతున్నారన్నారు. వివాహానంతరం పేర్లు, చిరునామాలు, ఉపాధి నిమిత్తం వలస వెళ్లిన కార్మికులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో లేని పేద ప్రజల తమ అర్హతను నిరూపించుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు.
ఫలితంగా అర్హులైన పౌరుల పేర్లు ఓటర్ జాబితాల నుంచి తొలగించబడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలధారమైన సార్వత్రిక వయోజన ఓటు హక్కు స్ఫూర్తికి విఘాతం కలిగించే అంశంగా భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. అలాగే 25 రాష్ట్రాలలో (SIR) అమలు చేస్తూ 14 కోట్ల ఓటర్లను తొలగించారని ఆరోపించారు.
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్.. మోదీ, షా ప్రభుత్వానికి ఏజెంట్ గా మారి ఎన్నికలను వారికి అనుకూలంగా మారుస్తున్నాడని ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. తక్షణమే జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా (Nizamabad) కార్యదర్శి భారతి, నగర అధ్యక్షురాలు లక్ష్మి, నగర కార్యదర్శి సంజన, సురేఖ, తదితరులు పాల్గొన్నారు.

