నిర్మల్ కలెక్టరేట్ ఎదుట అర్కాయితండా వాసుల ఆందోళన

కలం, నిర్మల్ : సారంగాపూర్ మండలం సోనాపూర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని అర్కాయితండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అటవీశాఖ అధికారులు అడ్డంకులు తొలగించాలని కోరుతూ లబ్ధిదారులు సోమవారం జిల్లా కలెక్టరేట్ (Nirmal Collectorate ) ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. లంబాడ, మథుర సామాజిక వర్గాలకు చెందిన 40 కుటుంబాలు గత 40 ఏళ్లుగా అటవీ ప్రాంతంలోని గుడిసెల్లో నివసిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం తమకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినప్పటికీ, ఇళ్ల నిర్మాణానికి అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>