‘భద్రాచలం రోడ్’ పేరు మార్చాలి.. కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే కూనంనేని లేఖ!

​కలం, ఖమ్మం బ్యూరో : భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ పేరును తక్షణమే ‘కొత్తగూడెం రైల్వే స్టేషన్’గా మార్చాలని కొత్తగూడెం శాసనసభ్యులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌లకు సోమవారం విడివిడిగా లేఖలు రాశారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్ పూర్తిగా కొత్తగూడెం పట్టణం నడిబొడ్డున ఉన్నప్పటికీ, దానిని ‘భద్రాచలం రోడ్’ అని పిలవడం వల్ల ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలం పట్టణం ఈ స్టేషన్‌కు చాలా దూరంలో ఉందనే విషయాన్ని గుర్తుచేస్తూ, కొత్తగూడెం మాత్రమే ఈ రైల్వే సేవల ద్వారా నేరుగా అనుసంధానమై ఉందని వివరించారు. ప్రస్తుత పేరు ఇక్కడి భౌగోళిక వాస్తవికతకు ఏమాత్రం సరిపోవడం లేదని స్పష్టం చేశారు.

​ప్రాంతీయ అస్తిత్వాన్ని, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా రైల్వే స్టేషన్ పేరును కొత్తగూడెంగా మార్చాల్సిన బాధ్యత రైల్వే శాఖపై ఉందని ఆయన పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల సౌకర్యం, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రైల్వే ఉన్నతాధికారులు ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించి, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>