కలం, వెబ్‌డెస్క్: సర్ ప్రక్రియను రద్దు చేయాలని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామా చేయాలని దేశ వ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సీజేపీ, విపక్షాలు ఈ అంశంపై ఢిల్లీలో ఆందోళనలను తీవ్ర తరం చేశాయి. తాజాగా హైదరాబాద్ (Hyderabad)లో యువత ఇదే డిమాండ్‌తో నిరసనలు (Protest) చేపట్టారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు నగర పౌరులు, యువత శాంతియుత నిరసనకు దిగారు. ప్లకార్డులు చేతపట్టి ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వం, ఎన్నికల సంఘం నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ శాంతియుత నిరసన ఉద్రిక్తతకు దారి తీయకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని ఆందోళనకారులు స్పష్టం చేశారు. తక్షణమే తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
Also Read : నల్లగొండలో తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయ వివాదం
Follow Us On : WhatsApp

