శ్రీశైలం రిజర్వాయర్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు

కలం, వెబ్‌డెస్క్ : శ్రీశైలం రిజర్వాయర్‌కు(Srisailam Reservoir) ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో (World Book of Records) శ్రీశైలం రిజర్వాయర్ చోటు సంపాదించింది. దక్షిణాసియాలో మరే ప్రాజెక్టుకు లేని విధంగా ఈ రిజర్వాయర్‌లో 60 అడుగుల వెడల్పు, 55 అడుగుల ఎత్తు కలిగిన క్రస్ట్ గేట్లు ఉన్నాయి. సముద్ర మట్టానికి 980 అడుగుల ఎత్తులో నిర్మితమైన ఈ ప్రాజెక్టు ప్రత్యేకతను చాటుకుంది. 2009 అక్టోబర్ 2న రికార్డు స్థాయిలో 25.4 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినప్పటికీ, ఓవర్‌ఫ్లో అయినా ప్రాజెక్టు చెక్కుచెదరకుండా పటిష్టంగా నిలిచింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం రిజర్వాయర్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గుర్తింపు లభించింది. ఈ గుర్తింపునకు సంబంధించిన సర్టిఫికెట్‌ను నేడు శ్రీశైలంలో డ్యామ్ అధికారులు అందుకోనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>