కలం, వెబ్‌డెస్క్: ఉత్తర ప్రదేశ్‌లో భారీ వరదలు, వర్షాలు, వడగళ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు సీఎం యోగి ఆదిత్యానాథ్ (CM Yogi Adityanath) గుడ్ న్యూస్ చెప్పారు. 9 లక్షల మంది రైతులకు రూ.439 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని అందించనున్నట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని గురుగోరఖ్నాథ్‌జీ పీఠం నుంచి నేరుగా రైతులకు అందించనున్నారు. ఈ సందర్భంగా సంక్షోభ సమయాల్లో అన్నదాతలకు అండగా నిలిచి, వారి వ్యవసాయాన్ని తిరిగి గాడిన పెట్టడమే డబుల్ ఇంజన్ సర్కార్ సంకల్పమని సీఎం యోగి పేర్కొన్నారు. ఈ ఆర్థిక సాయం ద్వారా రైతులు వ్యవసాయ పెట్టుబడులను సమకూర్చుకోవడానికి సహాయం చేస్తున్నట్లు చెప్పారు. దీంతో రాష్ట్రంలో వ్యవసాయానికి కొత్త ఊపునివ్వడానికి ఈ సహకారం ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో తెలిపారు.

