భ‌గ‌త్ సింగ్‌కు ఓటు హక్కు.. జాబితాపై విమ‌ర్శ‌లు

క‌లం, వెబ్‌డెస్క్: భార‌త ఓట‌ర్‌ జాబితా (Voter List)లో నెల‌కొన్న త‌ప్పులు మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారాయి. స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు భ‌గ‌త్ సింగ్‌ (Bhagat Singh)ను ఓట‌రుగా గుర్తిస్తూ జాబితాలో పొందుప‌ర్చ‌డం ప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పంజాబ్‌లోని లూథియానా ఈస్ట్ నియోజకవర్గ ఓటరు జాబితాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుది. లూథియానా ఈస్ట్ నియోజకవర్గం పార్ట్ 38లోని సీరియల్ నంబర్ 422 ఓటరు వద్ద భగత్ సింగ్ ఫోటో ఉంది. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ రాజా వారింగ్ (Amarinder Singh Raja Warring) ఎక్స్ వేదికగా వెల్ల‌డించారు. ఈ పొరపాటుపై ఆయన తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ఎన్నికల అవకతవకల ఆరోపణల నేప‌థ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ వివాదంపై లూథియానా జిల్లా ఎన్నికల అధికారి స్పందిస్తూ ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. పాత ఓటరు జాబితాలోని ఈ తప్పు ఆగస్టు 13న ప్రచురించబడిన ముసాయిదా జాబితాలో అలానే కొనసాగిందని తెలిపారు. స‌ర్‌ ప్రక్రియలో ఈ లోపాన్ని ముందే గుర్తించి సరిదిద్దినట్లు వెల్లడించారు. సరిదిద్దబడిన సరైన ఫోటోతో కూడిన తుది ఓటరు జాబితాను అక్టోబర్ 12న ప్రచురించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>