కలం, వనపర్తి: స్టార్ హీరోయిన్లు భాగ్య శ్రీ బోర్సే (Bhagyashri Borse), పాయల్ రాజ్‌పుత్ వనపర్తిలో ఆదివారం సందడి చేశారు. కొత్తకోట రోడ్డులో ఒకే రోజు రెండు షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసేందుకు రావడంతో పట్టణంలో పండుగ వాతావరణం కనిపించింది. గరుడ వస్త్ర సిల్క్స్ నూతన షోరూమ్‌ను హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ప్రారంభించగా.. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో దసరా డబుల్ ధమాకా సేల్‌ను పాయల్ రాజ్‌పుత్ ప్రారంభించారు. వీరిని చూసేందుకు ఫ్యాన్స్, యువత పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కొత్తకోట రోడ్డు జనసందోహంతో కిక్కిరిసింది.
గరుడ వస్త్ర సిల్క్స్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్సీ కె. దామోదర్‌రెడ్డి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ, రాష్ట్ర నాయకుడు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ మిడిదొడ్డి మాధవి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.
బతుకమ్మ ఇష్టం: పాయల్ రాజ్‌పుత్
చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో సినీనటి పాయల్ రాజ్‌పుత్ సందడి చేశారు. వనపర్తికి రావడం సంతోషంగా ఉందని.. తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఇక్కడ అందుబాటులో ఉన్న వస్త్రాల డిజైన్లు, వెరైటీలు కస్టమర్లను ఎంతో ఆకట్టుకుంటాయని పేర్కొన్నారు.

