కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో కొండా లక్ష్మణ్ బాబూజీ విగ్రహాన్ని మంత్రి తుమ్మల (Minister Thummala) నాగేశ్వరరావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేనేత రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ విజయ్ కుమార్, రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్తపు మురళి ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్, వివిధ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు, మంత్రి తుమ్మల అభిమానులు పాల్గొన్నారు.

