బీసీలకే 40 శాతం సీట్లు: సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పార్టీ పరంగా 40 శాతం సీట్లు కేటాయించబోతున్నట్లు సీఎం చంద్రబాబు (Chandrababu) తెలిపారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ‘జయహో బీసీ.. జనాభాలో సగం-కూటమి ఇచ్చింది బలం’ నినాదంతో రాష్ట్రవ్యాప్త ప్రచారానికి పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసినా.. కూటమి ప్రభుత్వం మాత్రం బీసీలకు మెజార్టీ స్థానాలు దక్కేలా చర్యలు తీసుకుందన్నారు.

ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలు మినహాయించి.. మిగిలిన అన్ని సీట్లలో అధిక శాతం బీసీలకే సీట్లు ఇవ్వబోతున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. స్థానిక ఎన్నికలను సీరియస్‌గా తీసుకుని పనిచేయాలని.. జనసేన, బీజేపీతో కలిసి టీడీపీ నాయకులు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. ఎలాంటి అభిప్రాయబేధాలు లేకుండా.. కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు.

జగన్ కుట్ర బయటపడింది..

వైఎస్ వివేకా హత్య కేసు(YS Viveka Murder Case)లో అంతిమ లబ్ధిదారు జగన్ అన్న విషయం బయటపడిందని సీఎం చంద్రబాబు (Chandrababu) పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు. హత్యను తానే చేయించినట్లు కత్తి తన చేతిలో పెట్టాలన్న జగన్ కుట్ర బయటపడిందని.. అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్న వ్యక్తి తనపై ఆరోపణలు చేశాడని మండిపడ్డారు. ఈడీనే టీడీపీనే పంపిస్తోందని గొడ్డలి పార్టీ అంటోందని.. ఫేక్ ప్రచారాలు చేయడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. జగన్ కారణంగా అధికారులు, వ్యాపారవేత్తలు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

Also Read : 2047 నాటికి భారత్ అభివృద్ధి: ప్రధాని మోదీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>