ఇసైయాస్ బీభత్సం.. నలుగురు మృతి, అంధకారంలో లక్షలాది మంది

కలం, వెబ్ డెస్క్: అమెరికాలో ఇసైయాస్ తుఫాను (Hurricane Isaias) బీభత్సం సృష్టించింది. ఈ ప్రకృతి విపత్తులో నలుగురు మృతి చెందగా.. విద్యుత్ సరఫరా నిలిచిపోయి 8 లక్షల మంది అంధకారంలోకి వెళ్లిపోయారు. ఇప్పటికే  ఇసైయాస్ హరికేన్ ఫ్లోరిడాలో తీరం దాటింది. అనంతరం పోస్ట్-ట్రాపికల్ సైక్లోన్‌గా బలహీనపడింది. తుఫాన్ ప్రభావంతో మిల్టన్‌లో 100 ఎంపీహెచ్ వేగంతో ఈదురుగాలులు వీచాయి పెర్డిడో కీ, మిల్టన్, శాంటా రోసా బీచ్ ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది.

హరికేన్  ప్రభావంతో ఫ్లోరిడా (Florida), అలబామా, జార్జియా, మిస్సిసిపి రాష్ట్రాల్లో పరిస్థితులు తీవ్ర రూపం దాల్చాయి. తుఫాన్ (Hurricane Isaias) ధాటికి చెట్లు, విద్యుత్ తీగలు నేలకూలడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పలు రహదారులను అధికారులు మూసివేశారు. ప్రజలను సురక్షిత స్థానాలకు చేర్చేందుకు అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. హైవేలు, వంతెనలు, విమానాశ్రయాలను మళ్లీ తెరిచేందుకు, నష్టాన్ని అంచనా వేసేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.

స్తంభించిన జనజీవనాన్ని పునరుద్ధరించేందుకు అధికారం యంత్రంగం పనులు వేగవంతం చేసింది. ఫ్లోరిడాలో విద్యుత్ పునరుద్ధరణ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు.. పనులు శవవేగంగా సాగుతున్నాయని అక్కడి అధికారులు చెప్పారు.  ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఫ్లోరిడాలో 4,20,000 మంది, అలబామాలో 1,90,000 మంది, జార్జియాలో 43,000 మంది, మిస్సిసిపిలో 17,000 మంది వినియోగదారులు విద్యుత్ సౌకర్యం కోల్పోయారు. మరోవైపు. పసిఫిక్ మహాసముద్రంలో కదులుతున్న ‘రాచెల్’ అనే మరొక తుఫాను కారణంగా కాలిఫోర్నియాలో మరో 7,000 మందికి కరెంట్ సరఫరా ఆగిపోయింది.

Also Read : 2047 నాటికి భారత్ అభివృద్ధి: ప్రధాని మోదీ

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>