దసరాకు RC17 ముహూర్తం.. రామ్‌చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ

కలం, సినిమా: రామ్‌చరణ్ (Ram Charan) మూవీ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. RC17 సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు దసరా సందర్భంగా ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 20న ఈ చిత్రానికి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం. దీంతో రామ్‌చరణ్ తదుపరి ప్రాజెక్టుపై సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.

ఇక RC17లో హీరోయిన్‌గా సారా అర్జున్ పేరు వినిపిస్తోంది. ఆమెను ఈ సినిమాలో కథానాయికగా ఎంపిక చేసే అవకాశాలున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే హీరోయిన్ ఎంపికతో పాటు ఇతర నటీనటులు, దర్శకుడు, చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ మూవీని సుకుమార్ డైరెక్ట్ చేయబోతుండటంతో టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>