పీఏసీఎస్‌ బలోపేతానికి కవ్వంపల్లి కీలక సూచనలు

కలం, కరీంనగర్: మొండి బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ (Kavvampally Satyanarayana) సూచించారు. రైతులకు రుణాలు మంజూరు చేసే విషయంలో ఎలాంటి ఇబ్బందులు కల్పించవద్దని, అవసరమైతే నిబంధనలను సరళతరం చేయాలని అన్నారు. ఆదివారం తిమ్మాపూర్‌ మండలం పోరండ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (Porandla PACS) నూతన చైర్మన్‌గా గోపు తిరుపతిరెడ్డితో పాటు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాల అభివృద్ధికి పాత బకాయిలు ప్రతిబంధకంగా మారకుండా చూడాలన్నారు. బకాయిల వసూళ్ల విషయంలో ఉదాసీన వైఖరిని వీడి, అవసరమైతే ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని సూచించారు. అదే సమయంలో రైతులకు రుణాల మంజూరులో అనవసర జాప్యం లేకుండా చూడాలని పేర్కొన్నారు. ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతున్న పోరండ్ల పీఏసీఎస్‌(Porandla PACS)ను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు నూతన పాలకవర్గం సమష్టిగా కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా కూరగాయలు సాగు చేసే రైతులను ప్రోత్సహిస్తూ, వారి ఆదాయం పెరిగేలా సహకార సంఘం తరఫున అవసరమైన సహకారం అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నోడల్‌ అధికారి అక్బరుద్దీన్‌, స్థానిక సర్పంచ్‌ అసోద శ్రీనివాస్‌, కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నర్సయ్య, పీఏసీఎస్‌ చైర్మన్లు మోరపల్లి రమణారెడ్డి, ఒగ్గు దామోదర్‌, ముద్దసాని శ్రీనివాస్‌రెడ్డి, తిమ్మాపూర్‌ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు బండారి రమేష్‌, పార్టీ నాయకులు గోపు మల్లారెడ్డి, చింతల తిరుపతిరెడ్డి, లక్ష్మారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, ఉంటా రాజేందర్‌రెడ్డి, ద్యావ శ్రీనివాస్‌రెడ్డి, పులి కృష్ణ, లింగాల శ్రీనివాస్‌, రేమిడి శ్రీనివాస్‌రెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి, రావుల కృష్ణగౌడ్‌, అయితం వెంకన్న, పొన్నాల సంపత్‌, కేతిరెడ్డి లింగారెడ్డి, మేడి అంజయ్య, పోలు రాము, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read : పోరాటం ఆపబోం.. కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటన

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>