తులం బంగారం హామీపై ఎమ్మెల్యే ధన్‌పాల్ గళం

కలం, నిజామాబాద్ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం ఇవ్వాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal) డిమాండ్ చేశారు. ఆదివారం నిజామాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కళ్యాణ లక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్ (Shaadi Mubarak) పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కళ్యాణ లక్ష్మి పథకంపై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయని, పథకాన్ని నిలిపివేస్తారనే పుకార్లు వస్తున్నాయని తెలిపారు. దీనిపై అధికారులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు స్పష్టత ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తోందని, కనీసం హామీ ఇచ్చిన సమయంలో ఉన్న ధర ప్రకారమైనా బంగారం ఇవ్వాలని అన్నారు.

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు చెక్కులను త్వరగా అందజేయాలని ధన్‌పాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 275 మంది లబ్ధిదారులకు రూ.2.75 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నూడా చైర్మన్ కేశ వేణు, బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, మఠం పవన్, జగదీష్ కులకర్ణి, న్యాలం సునీత రాజు, బంటు ప్రీతి ప్రవీణ్, ఇప్పకాయల సుమిత్ర కిషోర్, నాయకులు పంచరెడ్డి శ్యామ్, పవన్ ముందడ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>