చెన్నై మెట్రోలో మోదీ, విజ‌య్ జ‌ర్నీ!

క‌లం, వెబ్‌డెస్క్‌: తమిళ‌నాడు ప‌ర్య‌ట‌న కోసం వ‌చ్చిన ప్ర‌ధాని మోదీ (PM Modi) కి చెన్నై ఎయిర్‌పోర్టులో సీఎం విజ‌య్ (CM Vijay) ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం చెన్నైలో రూ.13 వేల కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా రూ.4,900 కోట్లతో నిర్మించిన చెన్నై మెట్రో ఫేజ్-2 (Chennai Metro Phase 2) పూనమల్లి-వడపళని మార్గాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. అలాగే ప్రఖ్యాత జలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఐఐటీ మద్రాస్ బ్రెయిన్ సెంటర్‌ను ప్రధాని సందర్శించారు.

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రయాణించారు. పోరూర్ బైపాస్ స్టేషన్ నుంచి పూనమల్లి బైపాస్ స్టేషన్ వరకు వీరిద్ద‌రూ మెట్రోలో ప్రయాణించారు. తిరిగి అదే మార్గంలో పూనమల్లి నుంచి పోరూర్ బైపాస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ ప్రత్యేక మెట్రో ప్రయాణం ద్వారా ప్రధాని మోదీ నగరంలోని రవాణా సౌకర్యాలను, మెట్రో విస్తరణను పరిశీలించారు. ప్ర‌యాణ స‌మ‌యంలో కూడా అధికారులు, సీఎంతో అభివృద్ధి ప‌నుల గురించి చ‌ర్చించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>