శ‌ర‌న్న‌వ‌రాత్రుల మండ‌పాల‌కు ఫ్రీ క‌రెంట్!

క‌లం, వెబ్‌డెస్క్‌: దేవీ న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు జ‌రుపుతున్న చోట మండ‌పాల‌కు (Navratri Mandapalu) ఉచిత విద్యుత్ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆదివారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. న‌వ రాత్రుల సంద‌ర్భంగా అమ్మ‌వారు తొమ్మిది రోజులు తొమ్మిది అవ‌తారాల్లో ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా మండ‌పాలు నిర్వ‌హించే చోట ఏర్పాట్లు కూడా పూర్త‌య్యాయి. ఈ ప‌ర్వ‌దినాల్లో విజ‌య‌వాడ‌కు ఏటా వేలాది మంది భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు. ఈ సంద‌ర్భంగా ఇంద్రకీలాద్రి శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాల శోభ‌తో అల‌రారుతోంద‌ని లోకేశ్ పేర్కొన్నారు. ఉత్స‌వాల‌కు వ‌స్తున్న భ‌క్తుల కోసం భారీ ఏర్పాట్లు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఆ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆశీస్సుల‌తో ప్ర‌జ‌లంద‌రూ ఆయురారోగ్యాల‌తో, సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని కోరుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>