బాసరలో అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

కలం, బాసర : చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి (Basara) ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో బాసరకు తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే అర్చకులు అమ్మవారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు.

అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతి అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శరత్ పాఠక్, ఈవో అంజనీ దేవి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>