శ్రీ గిరి నందిగుండం ఆలయంలో భవానీ దీక్షలు షురూ!

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గిరి నందిగుండం (Nandigundam) దుర్గామాత ఆలయంలో ఆదివారం శరన్నవరాత్రి ఉత్సవాలు (Sharannavaratri Celebrations) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు భవానీ మాలధారణ చేశారు. ‘జై భవానీ.. జైజై భవానీ’ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకటాచారి భక్తులకు శాస్త్రోక్తంగా మాలధారణ చేయించారు. భవానీ దీక్షలో పాటించాల్సిన నియమ నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరాగా, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>