క్రేజీ టైటిల్‌తో రవితేజ కొత్త సినిమా.. త్వరలో షూటింగ్

కలం, సినిమా: ‘ఇరుముడి’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో జోరు మీద ఉన్న మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) తన కొత్త సినిమాను ప్రకటించారు. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీకి ‘తులాభారం’(Thulabharam) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌తోనే ఆసక్తి పెంచిన ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.

ఈ చిత్రంలో రవితేజను ‘క్రైమ్ మహారాజా’గా పరిచయం చేస్తూ విడుదల చేసిన అప్‌డేట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో  ప్రియాంక మోహన్, అనస్వర రాజన్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైవిధ్యమైన కథాంశం, ఆసక్తికరమైన నటీనటుల కలయికతో రూపొందనున్న ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. రవితేజ మార్క్ ఎనర్జీకి వివేక్ ఆత్రేయ శైలి తోడైతే తెరపై ఎలాంటి సందడి ఉంటుందో చూడాలి. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి కొత్త అనుభూతిని అందిస్తుందో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>