బీఆర్ఎస్‌కు ప్ర‌జ‌లే బుద్ధి చెప్తారు: బీజేపీ కార్పొరేటర్ వేణు

క‌లం, క‌రీంన‌గ‌ర్‌: సొంత పార్టీలో ఉన్న వారినే కొత్తగా చేరికలంటూ బీఆర్‌ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని కిసాన్ నగర్ 29వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్ (Somidi Venu Prasad) విమర్శించారు. స్థానిక ఎస్‌బీఎస్ ఫంక్షన్ హాల్‌లో శ‌నివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు జంబి గద్దెకు గులాబీ రంగు వేసుకున్న వీరికి, ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చాక కాషాయ రంగు వేస్తే తప్పు పట్టే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. టౌన్ ప్రెసిడెంట్ హరిశంకర్ పూర్తిగా విఫలమయ్యారని, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నా, ప్రజలు ఎన్నికల్లో మీ పార్టీని తిరస్కరించి సింగిల్ డిజిట్‌కు పరిమితం చేసినా సిగ్గులేకుండా మాట్లాడటం హాస్యాస్పదమ‌ని విమ‌ర్శించారు.

రవీందర్ సింగ్ గతంలో బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లలేదా? అని ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సహకారంతోనే నగరంలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా భారీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. దళితబంధు పేరుతో మోసం చేసిన వారిపై బాధితులు తిరుగుతున్నారని, బీసీ నాయకులైన వీరు దొరల పార్టీ వెనుక తిరుగుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో కరీంనగర్‌లో బీజేపీ జెండా ఎగురుతుందని, బీఆర్‌ఎస్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ రవీంద్ర భూపతి, మేకల వెంకటేష్, కర్రే పద్మా అనిల్, పొన్నం మండన్నా, కార్యకర్తలు గాలి సురేష్, కళ్యాణ్, విష్ణు ప్రసాద్, పవన్, సాయివర్ధ‌న్‌ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>