కలం, నిర్మల్ : మహాలయ అమావాస్య ప్రభావంతో (Mahalaya Amavasya Impact) శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని రహదారులు జనసంచారం లేక వెలవెలబోయాయి. సాధారణ రోజుల్లో రద్దీగా కనిపించే ప్రధాన రహదారులు, కూడళ్లు జనాలు బయటకు రాక నిర్మానుష్యంగా మారాయి. అమావాస్య నేపథ్యంలో చాలామంది ఇళ్లకే పరిమితం కావడంతో పట్టణంలో సందడి తగ్గింది. మరోవైపు ఈ నెలలో పట్టణంలో మూడు షాపింగ్ మాల్స్ ప్రారంభం కావడంతో ఎటు చూసినా కొనుగోళ్ల సందడి కనిపించింది. అమావాస్య ప్రభావంతో సాధారణంగా రద్దీగా ఉండే శివాజీ చౌక్, వివేక్ చౌక్, బస్టాండ్, పాత బస్టాండ్ ప్రాంతాలు జనసంచారం తగ్గడంతో బోసిపోయాయి. దీంతో పట్టణంలోని ప్రధాన వీధుల్లో రోజువారీ హడావుడి కనిపించలేదు.

