కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

కలం, జోగులాంబ గద్వాల: కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఇద్దరు మృతి చెందారు. ఇందువాసి గ్రామానికి (Induvasi Village) చెందిన సుమారు 35 మంది‌ కూలీలు మూడు రోజుల కిందట ఉపాధి కోసం పత్తి ఏరేందుకు గుల్బర్గా జిల్లాకు వెళ్లారు. శనివారం తెల్లవారుజామున కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాలోని భారత్‌మాల జాతీయ రహదారిపై కూలీలు ట్రాక్టర్‌పై ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏసేపు (42) అక్కడికక్కడే మృతి చెందగా, నాగన్న (40) చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. మొత్తం 25 మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సంతాపం..

రోడ్డు ప్రమాదంపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ ద్వారా బాధితులతో మాట్లాడారు. నిరుపేద కుటుంబాలు పొట్టకూటి కోసం వలస వెళ్లిన సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడం తీవ్రంగా బాధించిందన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకునేలా కర్ణాటక ప్రభుత్వం మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు. మృతుడి కుటుంబంతో పాటు గాయపడిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>