కలం, కరీంనగర్ బ్యూరో: ఎన్డీఏ కూటమి ఓట్లను, సీట్లను దొంగిలిస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని, దీనికి సహకరిస్తున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) వెంటనే రాజీనామా చేయాలని కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ (Vydhula Anjan Kumar) డిమాండ్ చేశారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేతల అరెస్టులను ఖండిస్తూ కరీంనగర్ ఇందిరా చౌక్ వద్ద కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా వైద్యుల అంజన్ కుమార్ (Vydhula Anjan Kumar) మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును ఎన్డీఏ ప్రభుత్వం దోచుకుంటోందని ఆరోపించారు. అనంతరం నిరాహార దీక్షలో కూర్చున్న అంజన్ కుమార్, ఆకారపు భాస్కర్ రెడ్డి, అబ్దుల్ రెహమాన్, పర్వత మల్లేశం, ఇతర నాయకులకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రెహమత్ హుస్సేన్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు ఆకుల నరసయ్య, ఎండీ తాజ్, కర్ర రాజశేఖర్,శ్రావణ్ నాయక్, అహ్మద్ అలీ, వెన్నం రజిత రెడ్డి, వరాల నర్సింగం,ఫహాద్, కాంతాల జగన్ రెడ్డి,ఆకుల ఉదయ్, పొన్నం శ్రీనివాస్ గౌడ్, సరిల్లా రతన్ రాజు,జల్లోజు శ్రీనివాస్, అమేర్, వేమారపు శ్రీనివాస్, మూల కృష్ణారెడ్డి, ఇమ్రాన్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నిహాల్, సలీముద్దీన్, మాలోతు మహాలక్ష్మి, స్వప్నశ్రీ,గడప శ్రీనివాస్, ఇమ్రాన్ ఘని, శుకూర్, చిలుక హనుమంత రెడ్డి, మాజీదు అలీ ఖాన్, ఎంఏ కరీం, గడ్డం శ్రీనివాస్, అందే శంకర్, పాషా, హైమద్, రూపీ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తాళ్లపల్లి అంజయ్య గౌడ్, హాజీ, కోడూరు రవీందర్ గౌడ్, మమత, మార్కరాజు, జిలకర రమేష్, వీర దేవేందర్, సత్రం శ్రీకాంత్, కుంభాల రాజకుమార్, నూనె గోపాల్ రెడ్డి, అక్బర్, తదితరులు పాల్గొన్నారు.
Also Read : అడవిలో అద్భుతం.. మంచిర్యాలలో దేశంలోనే తొలి అడ్వెంచర్!
Follow Us On: Instagram

