రాజకీయ కక్ష.. బ‌తుక‌మ్మ విగ్ర‌హాలు ధ్వంసం!

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి బ‌తుక‌మ్మ (Bathukamma ) సంబ‌రాలు ప్రారంభం కానున్నాయి. స్కూళ్ల‌కు ఇప్ప‌టికే సెల‌వులు ఇవ్వ‌డంతో పండుగ సంద‌డి మొద‌లైపోయింది. ఇక పండుగ వేళ మ‌హబూబాబాద్ జిల్లాలో బ‌తుక‌మ్మ విగ్ర‌హాల (Bathukamma Statues) ధ్వంసం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. జిల్లాలోని దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో బతుకమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ధ్వంసం చేశారు. బ‌తుక‌మ్మ ఎత్తుకున్న‌ట్లు ఉండే మ‌హిళ‌, బాలిక విగ్ర‌హాలు దారుణంగా దెబ్బ‌తిన్నాయి. విగ్ర‌హాల ముఖం భాగంలో ప‌గుల‌గొట్టి, చేతులు విరిచేసి శిథిలాల‌ను కింద ప‌డేశారు.

గ్రామంలో రాజకీయ కక్షల నేపథ్యంలో ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. వ్య‌క్తిగ‌త, పార్టీప‌ర క‌క్ష‌లు ఉంటే స్వ‌యంగా తేల్చుకోవాలి కానీ ఇలా విగ్ర‌హాల‌పై దౌర్జ‌న్యం చేయ‌డం స‌రికాద‌ని స్థానికులు ఆగ్ర‌మం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారిని గుర్తించి, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే వీలైనంత త్వ‌ర‌గా విగ్ర‌హాల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>