ఎన్నికల కమిషన్ తీరుపై ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆగ్రహం

కలం, ​కరీంనగర్: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, ఓట్ల తొలగింపునకు దారితీస్తున్న ‘SIR’ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య కరీంనగర్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో శనివారం నగరం పరిధిలోని తెలంగాణ చౌరస్తా వద్ద నిరసన (SFI, DYFI protest) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ​

దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించడంతో వాతావరణం వేడెక్కింది. పోలీసులు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధరావత్ నరేష్ పటేల్ మాట్లాడుతూ… ఓట్ల తొలగింపునకు బాధ్యత వహిస్తూ సీఈసీ రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం ఆగబోదని స్పష్టం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు యువత పిలుపునిస్తే, కేంద్ర ప్రభుత్వం రైళ్లు, బస్సులను నిలిపివేసి అడ్డుకోవాలని చూసిందని, యువత పట్ల కేంద్రానికి ఎందుకంత భయమని నిలదీశారు.

ప్రజల నిరసన హక్కును కాలరాయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ​సీఈసీ జ్ఞానేష్ కుమార్ నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. SIR ప్రక్రియ పేరుతో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న 37 లక్షల ఓట్లతో పాటు, దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్లకు పైగా అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎన్నికల కమిషన్‌ను అడ్డం పెట్టుకుని మళ్లీ అధికారంలోకి రావాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని, ఓటర్ల పేర్లను తొలగిస్తున్నా ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

​వెంటనే SIR ప్రక్రియను రద్దు చేసి, తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని, సీఈసీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును పరిరక్షించేందుకు దేశవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం(SFI, DYFI protest)లో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కాంపెల్లి అరవింద్, సహాయ కార్యదర్శి భోగేశ్వర్, గట్టు ఆకాష్, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శివ కుమార్, జిల్లా నాయకులు కిట్టు, దేవరాజు, లక్ష్మణ్, సిరి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : అ విషయాలన్నీ బయటపెడుతా.. బల్మూరి వెంకట్‌పై బీఆర్ఎస్ నేత ఫైర్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>