కలం, నిర్మల్ రూరల్ : పేదల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా చిట్యాల్ (Chityal) గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం (Free Mega Medical Camp) నిర్వహించినట్లు సర్పంచ్ ఏనుగు సుప్రియ వెంకట్‌రెడ్డి తెలిపారు. శనివారం నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్‌లో గ్రామపంచాయతీ, వీడీసీ ఆధ్వర్యంలో టీమ్ విమలాకర్ ఫౌండేషన్, అపోలో హాస్పిటల్స్ సౌజన్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ ఈ. విమలాకర్‌రెడ్డి, డాక్టర్ కె.వి. దినేష్‌రెడ్డి, డాక్టర్ గౌరింగు ష్రాఫ్, డాక్టర్ రాజు ముషం, డాక్టర్ అనురాగ్ భవనం తదితర వైద్యులు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు అందించారు.
అల్ట్రాసౌండ్ అబ్డొమెన్, ఎండోస్కోపీ, సిగ్మోయిడోస్కోపీ, ప్రొక్టోస్కోపీ, ఈసీజీ, 2డీ ఎకో, ఎక్స్‌రేతోపాటు సీబీపీ, లివర్ ఫంక్షన్ టెస్ట్, సీరమ్ క్రియాటినిన్, ఆర్‌బీఎస్, సీరమ్ యూరిక్ యాసిడ్, హెపటైటిస్ బి, సి వైరల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులకు చెందిన వైద్యులు మారుమూల గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు పరీక్షలు చేయడంతోపాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం అభినందనీయమని సర్పంచ్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ వైద్యులు సూచించిన సలహాలు, సూచనలు పాటించాలని కోరారు. ఈ శిబిరానికి చిట్యాల్‌తోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

