ఫైనాన్స్ సంస్థ వేధింపుల ఆరోపణలు.. ఖమ్మంలో లారీ యజమాని సూసైడ్!

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరంలోని దానవాయిగూడెం (Danavaigudem) కు చెందిన లారీ యజమాని అర్వపల్లి వెంకన్న (57) బలవన్మరణానికి పాల్పడ్డారు. లారీకి మూడు వాయిదాలు (ఈఎంఐ) చెల్లించలేదనే కారణంతో ఓ ఫైనాన్స్ సంస్థ సిబ్బంది తీవ్రంగా ఒత్తిడి తేవడంతో పాటు, లారీని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురై లారీకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

​ఈ ఘటనకు సంబంధించి మృతుని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫైనాన్స్ సంస్థల ఒత్తిళ్లతోనే వెంకన్న ప్రాణాలు కోల్పోయాడని, సంఘటనపై పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై టౌన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కృష్ణకుమారి, శ్రీనివాసరావు స్పందిస్తూ.. ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>