రష్యాతో డీజిల్ డీల్: ట్రంప్ సంచలన నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్ : రష్యా నుంచి చమురు, గ్యాస్‌ కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు, భారీ సుంకాలు విధిస్తామని ఇన్నాళ్లూ తీవ్రస్థాయిలో హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) అనూహ్యమైన యూటర్న్ తీసుకున్నారు. అమెరికాలో రోజురోజుకూ ఆందోళనకరంగా పెరుగుతున్న ఇంధన ధరలను అదుపులోకి తీసుకురావడమే ధ్యేయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌(Vladimir Putin)తో మాట్లాడి డీజిల్ దిగుమతి కోసం ఒక కీలక ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఖరారు చేశారు.

ఈ ఒప్పందంలో భాగంగా రష్యా డీజిల్‌పై ఉన్న ఆంక్షలకు (Oil Sanctions) అమెరికా తాత్కాలిక మినహాయింపునిచ్చింది. దీనివల్ల రష్యా నుంచి అమెరికాకే కాకుండా అంతర్జాతీయ విపణికి కూడా భారీగా డీజిల్ సరఫరా కానుంది. మొదటి విడతగా రష్యా వెంటనే 3 లక్షల టన్నుల డీజిల్‌ను సరఫరా చేసేందుకు అంగీకరించిందని, వచ్చే నవంబరులో మరో 5 లక్షల టన్నులు, ఆ తర్వాత మరో 10 లక్షల టన్నుల డీజిల్‌ను ఎగుమతి చేస్తుందని ట్రంప్ (Donald Trump) వెల్లడించారు. సరఫరా పెరిగితే అమెరికాలో రవాణా ఖర్చులు తగ్గి నిత్యవసరాల ధరలు అదుపులోకి వస్తాయని భావిస్తున్నారు.

Also Read : ఎవరి కంట పడకుండా.. వరంగల్‌లో సీక్రెట్‌గా కోట్ల దందా!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>