నిజామాబాద్‌లో విషాదం.. ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో యువకుడి సూసైడ్!

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఇందల్వాయి మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన పల్లికొండ రఘు (25) అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య (Suicide) కు పాల్పడ్డాడు. రఘు ఆన్ లైన్ బెట్టింగ్‌లకు అలవాటుపడి డబ్బులు పోగొట్టుకున్నాడని గ్రామస్తులు అంటున్నారు. కొంతకాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఉన్నాడని చెబుతున్నారు.

తల్లిదండ్రులు లక్ష్మి, గంగారాం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లగా రఘు ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడని, ఇంకా వివాహం కాలేదని పేర్కొన్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుమలత తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>