నేడు ఏపీ క్యాబినెట్ భేటీ.. బీసీ రిజర్వేషన్లపై తుది నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం (AP Cabinet) అత్యవసరంగా సమావేశమవనుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై జీవోలను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన రిజర్వేషన్లు, జనాభా లెక్కల నివేదికపై క్యాబినెట్ సమగ్రంగా సమీక్షించనుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం చట్టబద్ధమైన రిజర్వేషన్ల శాతాన్ని ఖరారు చేయడంతో పాటు, గతంలో ఇచ్చిన జీవోలలో అవసరమైన మార్పులు లేదా ఉపసంహరణపై మంత్రి మండలి నిర్ణయం తీసుకొనుంది.

అయితే చట్టపరమైన పరిమితులు ఉన్నప్పటికీ, రాజకీయంగా బీసీ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం తగ్గకుండా 34 శాతం సీట్లు కేటాయిస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే హామీ ఇచ్చారు. మంత్రివర్గ ఆమోదం లభించిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించిన నూతన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలకు సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కసరత్తు వేగవంతం చేసింది. ఈ భేటీ అనంతరం ఏపీ స్థానిక పోరుపై పూర్తి స్పష్టత రానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>