కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్ పేట్‌కు (Budhwarpet Patient)చెందిన కత్తి శివాజీ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి మంజూరైన రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కును బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) శుక్రవారం బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఎంతో ఆసరాగా నిలుస్తుందని అన్నారు. వైద్య చికిత్సకు ఆర్థిక సాయం అందేలా సహకరించిన ఎమ్మెల్యేకు శివాజీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

