కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో తాము చేపట్టనున్న నిరసన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ (Dhruv Rathee) ఆరోపించారు. 50కి పైగా మెట్రో స్టేషన్లను మూసివేయడం, ఢిల్లీకి వచ్చే రైళ్లను రద్దు చేయడం, బస్సుల రాకపోకలను నిలిపివేయడం లాంటి చర్యలతో ఢిల్లీలో లాక్డౌన్ తరహా పరిస్థితులు సృష్టిస్తున్నారని విమర్శించారు. తమ నిరసనకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని, అందుకే భారీగా పోలీసులను మోహరించి ఆంక్షలు విధిస్తోందని ధ్రువ్ రాఠీ అన్నారు.

