డీజిల్ దొంగల ముఠా గుట్టురట్టు.. ఒకరు అరెస్ట్

కలం, భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో నిలిపి ఉంచిన లారీల నుంచి వరుసగా డీజిల్ చోరీలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా ముఠాకు (Diesel Theft Gang) చెందిన ఒక నిందితుడిని వలిగొండ పోలీసులు(Valigonda Police) శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.1,70,000 నగదుతో పాటు చోరీకి ఉపయోగించిన బాలెనో కారు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని బోరబండ (ఎర్రగడ్డ) ప్రాంతానికి చెందిన సయ్యద్ సోహైల్ అలియాస్ పప్పు సోహైల్ (24) శుక్రవారం ఉదయం వలిగొండలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన పోలీసుల వాహన తనిఖీల్లో పట్టుబడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా వలిగొండ (2), రామన్నపేట (2), భువనగిరి టౌన్ (1) పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం ఐదు డీజిల్ చోరీ కేసులతో సంబంధం ఉన్నట్లు తేలింది.

గత నెల సెప్టెంబర్ 20న విశాఖపట్నం నుంచి వచ్చిన మూడు లారీలను వలిగొండలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద నిలిపి ఉంచగా, నిందితులు అర్ధరాత్రి వాటి ట్యాంకుల నుంచి డీజిల్‌ను దొంగిలించారు. లారీ యజమాని కొత్త శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వలిగొండ పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ 303(2) కింద క్రైమ్ నంబర్ 251/2026తో కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.

చోరీ చేసిన డీజిల్‌ను ఇతర వాహనదారులకు విక్రయించి వచ్చిన డబ్బుతో నిందితుడు జల్సాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ డీజిల్ చోరీల నెట్‌వర్క్‌లో భాగమైన గణేష్, సల్మాన్, షఫీ, ఇమ్రాన్ అనే మరో నలుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.అరెస్టయిన సయ్యద్ సోహైల్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ పర్యవేక్షణలో, చౌటుప్పల్ డీఎస్పీ పి. మధుసూధన్ రెడ్డి ఆదేశాల మేరకు రామన్నపేట సీఐ ఎం. రవికుమార్, వలిగొండ ఎస్‌ఐ ఎ. శ్రీకాంత్ రెడ్డి, వారి సిబ్బంది ఈ కేసును ఛేదించారు. కేసును త్వరితగతిన ఛేదించిన వలిగొండ పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>