బుమ్రాను వద్దన్న ఆర్‌సీబీ.. పార్తివ్ పటేల్ తాజా వ్యాఖ్యలు

కలం, స్పోర్ట్స్: 2014 ఐపీఎల్ మెగా వేలంలో బుమ్రా లాంటి బౌలర్‌ను తీసుకోవాలని సూచించినా ఆర్‌సీబీ పట్టించుకోలేదని మాజీ క్రికెటర్ పార్తివ్ పటేల్ (Parthiv Patel) తాజాగా వెల్లడించాడు. అప్పట్లో తాను చేసిన సూచనను ఫ్రాంచైజీ పక్కన పెట్టిందని తెలిపాడు. 2014 వేలం తొలి రోజే పార్తివ్‌ను ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. అదే సమయంలో జస్‌ప్రీత్ బుమ్రా వేలంలో అందుబాటులో ఉండటాన్ని గమనించిన పార్తివ్.. అతడిని కూడా తీసుకోవాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు.

రూ.1.20 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం..

అయితే, బుమ్రాను కొనుగోలు చేయాల్సినంత విలువైన ఆటగాడిగా ఆర్‌సీబీ భావించలేదని పార్తివ్ గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత బుమ్రాను ముంబై ఇండియన్స్ రూ.1.20 కోట్లకు సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఆ జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగిన బుమ్రా.. ఐపీఎల్‌లో తనదైన ముద్ర వేశాడు. ఇప్పటివరకు 158 మ్యాచ్‌ల్లో 187 వికెట్లు పడగొట్టాడు. ఓవర్‌కు సగటున 7.33 పరుగుల ఎకానమీతో బౌలింగ్ చేశాడు. బుమ్రా ఎదుగుదలను చూస్తే.. 2014లో అతడిని తీసుకోవాలన్న పార్తివ్ సూచన ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>