కలం, బోనకల్: వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్ (Bonakal) మండలం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద కార్మికులు నిరసనకు దిగారు. వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక ఎమ్మార్వోకు అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి రూ. 12, 000 పెన్షన్లు ఇవ్వాలని, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద పెన్షన్లు ఇవ్వాలన్నారు. అలాగే ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. కొత్తవారికి వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని, పెన్షన్ 2000 నుండి 4 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బంధం రాజ్యం, వ్యవసాయ కార్మిక సంఘం మధిర డివిజన్ అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, మండల కమిటీ సభ్యులు భద్రాచలం, ఉప్పర శ్రీను, బోయినపల్లి గురవయ్య, గద్దల సుందర్రావు, కొట్టే జయరాజ్ బోయినపల్లి గురవయ్య, ఇమ్మడి వెంకటేశ్వర్లు, పర్సగని లక్ష్మి, గద్దె భూషమ్మ, బొడ్డుపల్లి రమాదేవి, ఆళ్ల శ్రీనివాసరెడ్డి, సంఘపు నరసయ్య పాల్గొన్నారు.

