శివాలెత్తిన శాంసన్.. విండీస్ టార్గెట్ 250

కలం, స్పోర్ట్స్: వెస్టిండీస్‌తో (IND vs WI) జరుగుతున్న రెండో టీ20లో భారత ఓపెనర్ సంజూ శాంసన్ చితకొట్టాడు. బౌండ్రీలే టార్గెట్‌గా మైదానంలో వీరవిహారం చేశాడు. తన ఫామ్‌పై వచ్చిన విమర్శలన్నింటికీ తన బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేదు. కానీ ఇషాన్ కిషన్ మాత్రం ఒకవైపు స్కోర్‌‌ను పరిగెత్తిస్తూనే మరోవైపు సంజూకు మంచి మద్దతు ఇచ్చాడు. దీంతో నిర్​ణీత 20 ఓవర్లలో భారత్ 4 వికెట్ల నష్​టానికి 24 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ సంజూ శాంసన్ విజృంభించి భారత్‌కు మంచి స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ అంచనాలను అందుకుంటూ అదరగొట్టింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ కలిసి అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. అభిషేక్ 12 బంతుల్లో 20 పరుగులు చేసి చేజ్ బౌలింగ్‌లో మోటీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయినా వన్‌డౌన్‌లో క్రీజ్‌లోకి వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి సంజూ మంచి పార్ట్‌నర్‌‌షిప్ నెలకొల్పాడు. కాగా 139 పరుగుల దగ్గర కిషన్(22 బంతుల్లో 43 పరుగులు) వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత శివమ్ దూబే కూడా అలా వచ్చి 7 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అప్పుడు బరిలోకి దిగిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మళ్​ళీ మ్యాచ్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. ఆ కీలక సమయంలో సంజూ శాంసన్ 41 బంతుల్లో 9ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగుల విధ్వంసకర బ్యాటింగ్‌కు ముగింపు వచ్చింది. స్రింగర్ బౌలింగ్‌లో పూరన్‌కు క్యాచ్ ఇచ్చి సంజూ పెవిలియన్ చేరాడు.

కాగా తిలక్ వర్మతో కలిసి అయ్యర్ మ్యాచ్‌ను ముందు సాగించాడు. వీరిద్దరూ కూడా నువ్వా నేనా అన్న స్థాయిలో బౌండ్రీలు బాదారు. కానీ చివరి నిమిషయంలో శ్రేయస్ అయ్యర్ 18 బంతుల్లో 40 పరుగులు చేసి క్యాచ్ ఔట్ అయ్యాడు. తిలక్ వర్మ కూడా 18 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. చివర్లో క్రీజ్‌లోకి వచ్చిన నమన్ ధీర్ 1 బంతికి 4 పరుగులు చేశాడు. వీటికి తోడు విండీస్ బౌలర్లు ఎక్స్‌ట్రాస్ రూపంలో 8 పరుగులు ఇచ్చారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.

వెస్టిండీస్ బౌలర్లలో రోస్టర్ చేజ్ అదరగొట్టాడు. 3.4 ఓవర్లు బౌలింగ్ చేసి 24 పరుగులిచ్చి కీలకమైన 3 వికెట్లు పడగొట్టి టీమిండియాకు కొంచెం తలనొప్పి తెచ్చాడు. ఆ తర్వాత హమర్ స్ప్రింగర్ 4 ఓవర్లలో 64 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>