కలం, నిజామాబాద్ బ్యూరో: దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలకు నిజామాబాద్ (Nizamabad) నగరం ముస్తాబవుతోంది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక మూడు రాష్ట్రాల సరిహద్దులు ఉండే ఈ జిల్లాలో ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు దశాబ్దాలుగా స్థిర నివాసం చేసుకుని జీవనం గడుపుతున్నారు. దీంతో ఇందూరును మినీ ఇండియా అని కూడా పిలుస్తారు. దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవారి ఆలయం ఉండే రహదారికి దేవీ రోడ్ అనే పేరు కూడా వచ్చింది. నవరాత్రుల నేపథ్యంలో ఇప్పుడు ఆ రహదారి అంతా రంగు రంగుల విద్యుద్దీపాల అలంకరణతో మెరిసిపోతోంది. ఆలయాన్ని కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

