ఆర్ట్స్ కాలేజీలో బతుకమ్మ సంబరాలు

కలం, హనుమకొండ: కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాల (KU Arts College) లో శుక్రవారం బతుకమ్మ సంబరాలు (Bathukamma Celebrations) ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద (Nerella Sharada) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకొని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహిళలపై దాడులను అరికట్టి, సమాజంతో పాటు కుటుంబంలోనూ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళల హక్కులపై అవగాహన కల్పించేందుకు మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో వంద రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు.

బాలికలకు స్వీయరక్షణ శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు. ఈ వేడుకల్లో కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య రామచంద్రం, జీడబ్ల్యూఎంసీ చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, పాలకమండలి సభ్యురాలు ఆచార్య రమాదేవి, డాక్టర్‌ అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. ఆర్ట్స్‌ కళాశాల శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించి, కళాశాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రిన్సిపల్‌ ఆచార్య సుంకరి జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో అధ్యాపకులు, మహిళా కమిషన్‌ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ పాటలు, ఆటపాటలతో సందడి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>