కలం, చంద్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా చంద్రుగొండ మండలానికి చెందిన మాజీ జడ్పీటీసీ అంకిరెడ్డి కృష్ణారెడ్డి తల్లి చిట్టెమ్మ ఇటీవల మృతిచెందారు. శుక్రవారం ఆమె స్వగృహానికి వెళ్లిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, చిట్టెమ్మ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అధైర్యపడవద్దని ఓదార్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీకటి కార్తీక్, డీసీసీ ప్రధాన కార్యదర్శులు భోజ్యా నాయక్, ధర్మ గోవింద రెడ్డి, నాగేశ్వరరావు, చంద్రుగొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

