రేపు చెన్నైకి రాహుల్ గాంధీ.. విజయ్‌ స్పెషల్ లంచ్!

కలం, వెబ్ డెస్క్: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) రేపు చెన్నైలో పర్యటించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటలకు యువతతో ‘ఛాత్రో కీ గూంజ్(Chhatron Ki Goonj)’ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అంతకన్నా ముందే సీఎం విజయ్‌తో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి నివాసానికి చేరుకోనున్నారు. సీఎం విజయ్ స్పెషల్ లంచ్ ఏర్పాటు చేయబోతున్నారని టీవీకే పార్టీ వర్గాలు తెలిపాయి.

రాహుల్ గాంధీ, సీఎం విజయ్ (Rahul Gandhi – Vijay) తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించబోతున్నారని సమాచారం. ఇద్దరి భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సర్ ప్రక్రియపై దేశ వ్యాప్తంగా భారీ ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. విజయ్‌తో కూడా ఇదే విషయమై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే టీవీకే పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, తమిళనాడులో జరిగిన రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీవీకే భారీ విజయం సాధించింది.

Also Read : శీతాకాలం మాయం.. తెలంగాణలో ‘డబుల్ సమ్మర్’!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>