ఉప ఎన్నిక‌ల్లో అధికార పార్టీల‌కే ప‌ట్టం..!

క‌లం, వెబ్‌డెస్క్‌: తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోంలో ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు (Bypoll Results) నేడు వెలువడ్డాయి. తమిళనాడులోని మధురాంతకం, ధారాపురం అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో అధికార పార్టీ టీవీకే (TVK) అభ్య‌ర్థులు విజయం సాధించారు. అన్నాడీఎంకే నుంచి గెలిచి, ఆ తర్వాత విజయ్ పార్టీలో చేరి రాజీనామా చేసిన వారే ఈ స్థానాల్లో మళ్లీ పోటీ చేసి విజయం సాధించారు. అయితే, ప్రస్తుతం విజయ్‌కు ఉన్న ప్రజాదరణతో ఏకపక్షంగా గెలవాల్సి ఉండగా, డీఎంకే, అన్నాడీఎంకేల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. ద్రావిడ పార్టీల మధ్య ఓట్ల చీలిక కారణంగా టీవీకే అతికష్టం మీద గట్టెక్కింది.

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఉపఎన్నికల్లో (Bypoll Results) బీజేపీ జోరు కొనసాగించింది. నందిగ్రామ్, రెజినగర్ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. సీఎం సువేందు అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిగ్రామ్‌తో పాటు, ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న రెజినగర్‌లోనూ బీజేపీ అభ్యర్థులు గెలవడం గమనార్హం. మైనారిటీ వర్గాలు కూడా తమను ఆదరించాయని, ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లోనూ తమకు భారీగా ఓట్లు పడ్డాయని సువేందు వ్యాఖ్యానించారు. అస్సాంలోని నాగావ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేబాశిష్ శర్మ ఘన విజయం సాధించారు. అలాగే పుదుచ్చేరిలోని థట్టాంచవడి స్థానంలో అధికార ఎఐఎన్‌ఆర్‌సీ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు.

Also Read : ఏసీబీ అదుపులో సివిల్‌ సప్లైస్‌ అధికారి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>