కలం, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) తన ఆరోగ్య రహస్యాన్ని చెప్పారు. ‘నేను ప్రతి రోజు మూడు కోడి గుడ్లు తింటాను. అందులో వైట్‌తో ఆమ్లెట్‌లా వేసుకుని తీసుకుంటాను. దీని వలన శరీరానికి సంపూర్ణంగా ప్రోటీన్ అందుతుంది. కావాల్సిన ఆరోగ్యం లభిస్తుంది. ఆసుపత్రికి వెళ్లే పని తగ్గుతుంది. ఈ వయస్సులో కూడా ఉత్సాహంగా పరుగెత్తుకుంటూ పనిచేస్తున్నానంటే కారణం, రహస్యం రోజూ తాను తీసుకునే ఈ ఆహారమే’ అన్నారు.
దేశంలో కోడి గుడ్ల ఉత్పత్తిలో ఏపీ అగ్ర స్థానంలో ఉందని.. అందుకే జనాలు కూడా కోడి గుడ్లు తినడం అలవాటు చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.. కూరగాయల ధరల మాదిరే గుడ్ల ధర తక్కువేనన్నారు. గతంలో కూడా పలుమార్లు చంద్రబాబు తన ఆరోగ్య రహస్యాలను వివరించారు. వైట్ రైస్ తాను తీసుకోనని చెప్పారు. పండ్లు, మిల్లెట్స్‌తో చేసిన ఇడ్లీ, దోశతో పాటు కోడి గుడ్లు, రోజుకు రెండు మూడు సార్లు బ్లాక్ కాఫీ తాగుతుంటానని పేర్కొన్నారు.

