గద్వాల ఆర్టీసీ డిపోలో గుర్తింపు సంఘం ఎన్నికలు

కలం, జోగులాంబ గద్వాల: తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు (TGSRTC Union Elections) శుక్రవారం ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ ఎన్నికల నేపథ్యంలో గద్వాల ఆర్టీసీ డిపో (Gadwal Depot) లో మొత్తం 371 ఓట్లు ఉండగా ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ), తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ), తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ పోటీ చేస్తున్నాయి.

అయితే ఈయూ, టీఎంయూ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. ఉదయం నుంచే ఆర్టీసి కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుని విధులకు హాజరవుతున్నారు. ఎన్నికల దృష్ట్యా గద్వాల ఆర్టీసీ డిపో‌ (Gadwal Depot) వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా కూటమి ఎన్నికల బరిలో నిలిచింది. తెలంగాణ ఆర్టీసీలో కార్మికుల హక్కులను కాపాడటంతోపాటు.. సమ్మె ద్వారా విలీన హక్కును సాధించిన జేఏసీలోని ప్రధాన సంఘాలే తమ కూటమిలో ఉన్నాయని, కార్మికులు ఆలోచించి ఓటు వేయాలని కార్మిక నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ ఆర్టీసీలో ప్రధానంగా ఉద్యోగుల భద్రతపై పోరాడుతూ.. ప్రభుత్వాన్ని కార్మికుల దగ్గరకు తీసుకొచ్చి, సమస్యలు పరిష్కరించేలా మార్గాలు అన్వేషిస్తామని ప్రచారంలో హామీ ఇచ్చారు.

Also Read : కేటీఆర్‌పై బ‌ల్మూరి వెంక‌ట్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>