మోటమర్రి రైల్వే స్టేషన్ వద్ద విషాదం.. రైలు ఢీకొని హోంగార్డ్ మృతి

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం మోటమర్రి రైల్వే స్టేషన్ (Motamarri Railway Station) పరిధిలో గురువారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మధిర పోలీస్ స్టేషన్‌లో హోంగార్డ్‌గా (Home Guard) విధులు నిర్వహిస్తున్న కటికల శ్రీనివాసరెడ్డి (58) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గురువారం అర్ధరాత్రి సమయంలో శ్రీనివాసరెడ్డి మోటమర్రి రైల్వే స్టేషన్‌లో ఒక ప్లాట్ ఫామ్ నుంచి మరో ప్లాట్ ఫామ్ వైపు దాటుతుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే మృతి చెందారు.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని పరిశీలించారు.​ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. హోంగార్డ్ శ్రీనివాసరెడ్డి అకాల మరణంతో మధిర పోలీస్ స్టేషన్‌లోనూ, ఆయన స్వగ్రామంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>