95 లక్షల ఓట్లు ఎక్కడికి వెళ్లాయి? ఈసీని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత

కలం, కరీంనగర్: తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ (Telangana Voter List Revision) ప్రక్రియ తీవ్ర అనుమానాలకు తావిస్తోందని, రాష్ట్రంలో దాదాపు 95 లక్షల ఓట్లు (27.8%) తగ్గడంపై ఎన్నికల సంఘం వెంటనే స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా మాజీ ఛైర్మన్ జీ.వి. రామకృష్ణ రావు  డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

​గతంలో 3.38 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య ఒక్కసారిగా 2.43 కోట్లకు పడిపోవడంపై (GV Ramakrishna Rao) ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర (21.1%), కర్ణాటక (19.5%), ఉత్తరప్రదేశ్ (13.2%), ఏపీ (10.8%) వంటి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, ఒక్క తెలంగాణలోనే దేశంలోనే అత్యధికంగా ఓటర్ల కోత విధించడం వెనుక ఉన్న అసలు కారణాలను ప్రజల ముందుంచాలన్నారు. ​ఈ సందర్భంగా ఈసీకి ఆయన పలు ప్రశ్నలు సంధించారు.

95 లక్షల ఓట్ల తొలగింపుకు సంబంధించి జిల్లాలు, నియోజకవర్గాలు, పోలింగ్ కేంద్రాల వారీగా వివరాలను వెంటనే బయటపెట్టాలని అన్నారు. ​మరణాలు, వలసలు, డూప్లికేట్ ఓట్ల వర్గీకరణను స్పష్టంగా వెల్లడించాలని, ఓట్లు తొలగించే ముందు సదరు ఓటర్లకు ముందస్తు నోటీసులు ఇచ్చారో లేదో తెలపాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో అర్హుడైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకూడదని, పారదర్శకత కోసం వెంటనే ఈ తొలగింపుల వివరాలన్నింటినీ బహిర్గతం చేయాలని జీ.వి. రామకృష్ణ రావు డిమాండ్ చేశారు.

Also Read : దక్షిణాఫ్రికా తమిళ మహిళకు అత్యున్నత నోబెల్ పురస్కారం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>